CM Revanth Counter to KTR Comments : రాష్ట్రానికి నిధుల కోసం దిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు చేసిన డిమాండ్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశరాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, పాలకపక్షనేతగా తాను వస్తానని రేవంత్ చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకురావాలని కోరారు.
మీరే తారీఖు డిసైడ్ చేయండి దీక్షకు మేం సిద్దమంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు తెచ్చుడో, సచ్చుడో తేల్చుకుందామని సవాల్ విసిరారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చామని మేమెప్పుడూ పదే పదే చెప్పలేదన్నారు. రూ.100 పెట్టి పెట్రోల్ కొన్నారు కానీ, అగ్గిపెట్టి కొనలేదని ప్రతిపక్ష పార్టీనుద్దేశించి మాట్లాడారు.
పాలకపక్ష నేతగా నేను వస్తా - ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలి :అగ్గిపెట్టి మర్చిపోయినట్టు నటించి అమాయక విద్యార్థులను బలిగొనలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది.
"మేమెప్పుడూ చావు నోట్లో తల పెట్టామని పదే పదే చెప్పలేదు. మేము అగ్గిపెట్టె మర్చిపోయి అమాయక విద్యార్థులను బలిగొనలేదు. ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్‌ను రమ్మనండి. ముఖ్యమంత్రిగా నేనూ వస్తా, ఇద్దరం జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చుందాం. తెలంగాణకు నిధులు తెచ్చుడో, సచ్చుడో తేల్చుకుందాం. మీరు తారీఖు డిసైడ్ చేయండి, జంతర్ మంతర్‌లో దీక్షకు మేం సిద్ధం."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి