తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్‌భవన్‌లో 'ఎట్‌హోం' కార్యక్రమం - హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖులు - AT HOME PROGRAM AT RAJBHAVAN

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తేనీటి విందుకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి - గవర్నర్‌ మెడల్స్ ప్రదానం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ - కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు

CM Revanth Reddy Attends At Home Program In Rajbhavan
CM Revanth Reddy Attends At Home Program In Rajbhavan (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 9:32 PM IST

CM Revanth Reddy Attends At Home Program In Rajbhavan :గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌హోం కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు తేనీటి విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌హోం కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు తేనీటి విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం - హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి (ETV Bharat)

పరేడ్​ గ్రౌండ్స్​లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్​ :గణతంత్ర వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తుందని ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థికరంగానికి వెన్నెముకగా ఉందని. అందులో భాగంగా 25 లక్షల మందికిపైగా రైతుల రుణాలు మాఫీ చేశామని గవర్నర్‌ స్పష్టం చేశారు. కర్షకులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నామని గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ వెల్లడించారు.

'వ్యవసాయం, సంక్షేమం, ఆహారభద్రత, ఇళ్లు అందరికీ దక్కేలా వివిధ అంశాలలో ప్రభుత్వం ముందుకువెళ్తుంది. ఎకరానికి రూ.12 వేలు ఇస్తూ రైతు భరోసాతో రైతులను ఆదుకుంటున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో సాయం అందించనున్నాం. అర్హతలు ఉన్న అన్ని కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులను ఇచ్చి ఆహారభద్రత కల్పించనున్నాం. రేషన్‌ కార్డులపై సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.5లక్షలతో ఇళ్లులేని వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించనున్నాం. 2024-25లో రూ.22,500 కోట్లతో 4.50లక్షల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిశ్చయించుకుంది' అని గవర్నర్ తెలిపారు.

ప్రజా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని గవర్నర్‌ పేర్కొన్నారు. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు నాలుగున్నర వేల కోట్లు ఆదా అయ్యాయన్నారు. యువత సాధికారత కోసం యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీని ఏర్పాటు చేశామని అలాగే పారదర్శకంగా 55 వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని గవర్నర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details