Congress Ministers Casted Their Vote in Telangana 2024: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఖమ్మం గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి, ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, సంగారెడ్డి జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ, వంచనగిరిలో మంత్రి కొండా సురేఖ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసి మంచి నాయకున్ని ఎన్నుకోవాలి : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రమైన సుందరయ్య నగర్ పోలింగ్ బూత్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఆయన సతీమణి నందిని, కుమారుడితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అత్యంత పవిత్రమైనదని, మంచి నాయకులను ఎన్నుకొని ఓటు విలువకు సార్ధకత చేకూర్చాలని పిలుపునిచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 151 బూత్ లో మంత్రి శ్రీధర్ బాబు ఓటు వేశారు. అందరితోపాటు సాదాసీదాగా వరుస క్రమంలో నిల్చుని అందర్నీ పలకరిస్తూ తన ఓటును వినియోగించుకున్నారు. అంతకుముందు మంథని పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఎన్నికల సందర్భంగా ఓటర్లతో కలిసి సరదాగా ముచ్చటించారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ - ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థులు - Telangana MP Candidates Cast Votes
ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు వేసిన పొన్నం: ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తన ఓటు హక్కును వినియోగించుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కుటుంబసమేతంగా ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మతతత్వానికో, ప్రాంతీయ తత్వానికో, కుల తత్వానికో, ప్రలోభాలకో లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రతి పౌరుడు ఎన్ని పనులు ఉన్నా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 182వ పోలింగ్ బూత్‌లో ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం అన్నారు.
ఓటు అంటే ప్రశ్నించే ధిక్కార స్వరం :నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. ఓటు అంటే ప్రశ్నించే ధిక్కార స్వరమన్న కోమటిరెడ్డి, అది ఉపయోగించుకున్నప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఓటు వేస్తే మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి అది దోహదపడుతుందని పేర్కొన్నారు.
కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి - మంత్రులు ఎక్కడెక్కడ వేశారంటే? (ETV Bharat) ఓటెత్తిన అధికారులు - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే? - OFFICERS CASTED VOTE IN TELANGANA
బర్కత్‌పురాలో కిషన్ రెడ్డి, పర్వతగిరిలో ఎర్రబెల్లి - ఇప్పటి వరకు ఓటేసిన రాజకీయ నేతలు వీళ్లే - Political Leaders Vote in Telangana