తెలంగాణ

telangana

ETV Bharat / state

'మీరు పెట్టుబడులతో రండి - అద్భుతాలు సృష్టిద్దాం' - CM REVANTH REDDY IN CII MEETING

సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి - హైదరాబాద్​ను తయారీ హబ్​గా మారుస్తున్నామని ప్రకటన- భవిష్యత్తులో కాలుష్యం లేని సిటీగా భాగ్యనగరం

CM Revanth Reddy in CII Meeting
CM Revanth Reddy in CII Meeting (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2025, 3:30 PM IST

CM Revanth Reddy in CII Meeting :తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించామని, హైదరాబాద్​లో నిర్మించతలపెట్టిన ఫోర్త్ సిటీ న్యూయర్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో పోటీ పడేలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో నిర్వహించిన సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలోనే గొప్ప నగరంగా నిర్మించాలనుకుంటున్నామని, ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుందని సీఎం తెలిపారు.

ఫ్యూచర్ హైదరాబాద్​ని కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్టీసీలోకి 3200 ఈవీ బస్సులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామన్నారు. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. వరదలు లేని నగరంగా హైదరాబాద్​ను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పా.

తయారీ కేంద్రంగా ఆ ప్రాంతాలు - సీసీఐ జాతీయ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్​ రెడ్డి (ETV Bharat)

రేస్‌కోర్స్‌ స్థలం ఫోర్త్‌సిటీకి! - ప్రత్యామ్నాయంగా ఒకటిన్నర రెట్ల భూమి!!

"ఈవీలపై రిజిస్ట్రేషన్లు, రోడ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇచ్చాం, 360 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్‌ రోడ్‌ నిర్మాణం జరుగుతుంది.రీజినల్‌ రింగ్‌ రైల్‌కు ప్రణాళికలు వేస్తున్నాం. తెలంగాణ అభివృద్ధిలో తోడ్పడాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నా2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంది. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నాం దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నాం." -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

ఈ ప్రాంతాలు తయారీ రంగానికి కేంద్రంగా :మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నామని, 2050 సంవత్సరానికి మహా నగరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే రూపొందిస్తున్నామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతాలు తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతున్నాయని తెలిపారు. తెలంగాణకు తీరప్రాంతం లేదని, అందుకే రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటు చేయానున్నట్లు వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కంపెనీలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.

హైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక - Zoo Park in Fourth City

ABOUT THE AUTHOR

...view details