CM Revanth Interesting Comments on Muslim Reservations :దశాబ్దాలుగా ముస్లింలు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నారని, ఇకపైనా దాన్ని కొనసాగిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు ఉంటున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ వాటిని అమలు చేస్తామని చెప్పారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నగరానికి వచ్చి ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామన్నారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ భేటీ - కాంగ్రెస్ గూటికి చేరువయ్యేనా?
Revanth Participate Iftar Dinner in LB Stadium : తెలంగాణకాంగ్రెస్‌అడ్డా అని ఇక్కడ రిజర్వేషన్లు తొలగించడం మోదీ, అమిత్ షాల తరం కాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హస్తం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు సముచిత గౌరవం ఇస్తున్నామని చెప్పారు. నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించామని తెలిపారు. సీఎం పేషీలోనూ వారికి ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. మైనార్టీ పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించామని గుర్తు చేశారు.
Iftar Dinner in Hyderabad :రాబోయే రోజుల్లో ఓ విశ్వవిద్యాలయంలో మైనార్టీ వర్గానికి చెందిన ఆచార్యుడికి వీసీగా అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలోనే తమ ప్రభుత్వం కొలువుదీరిందని ఇక్కడ ఏది చెప్పినా అది గీటురాయే అని స్పష్టం చేశారు. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.