Mahabubnagar Congress MLC Candidate 2024 :మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు హస్తం పార్టీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు పార్టీ బీ ఫామ్‌ను అందించారు. జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను రేవంత్‌రెడ్డి కోరారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు.
Mahabubnagar MLC Candidate 2024 :అనేక మంది ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అందుకే పార్టీలకు అతీతంగా వారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వివరించారు. తనకు బీ ఫామ్ అందజేసిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో తాను ఘనవిజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆయన కోరారు. సోమవారం ఉదయం 11:00 గంటలకు జిల్లా కేంద్రంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు.
ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన జీవన్‌రెడ్డి :ఇటీవలే మన్నె జీవన్‌రెడ్డి (Manne Jeevan Reddy) హస్తం పార్టీలో చేరారు. ఆయన బాబాయి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి నుంచి మహబూబ్‌నగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామం జీవన్‌రెడ్డి స్వస్థలం. ఆయన ఎంఎస్‌ఎన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.