CM Chandrababu Speech in Police Commemoration Day : విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకని ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని సీఎం అన్నారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారని శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీ పడలేదని వివరించారు. పోలీసుల సంక్షేమం కూటమి ప్రభుత్వం బాధ్యత అని అంతే కాకుండా పటిష్ఠ యంత్రాంగంగా తయారు చేయడం తమ కర్తవ్యమని వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని వాహనాలతో పాటు పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామని తెలిపారు. 2014-2019లో పోలీసు శాఖకు రూ.600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కొత్తగా వాహనాల కోసం రూ.150కోట్లు, పోలీసు కార్యాలయాల మరమ్మతులు, నిర్వహణకు రూ.60కోట్లు, పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు ఖర్చు చేశామని మరో రూ.27కోట్లతో ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేసినట్లు సీఎం వివరించారు.
'వైఎస్సార్సీపీ పునాదులే నేరాలు - ఘోరాలు' - ఎక్స్‌లో నారా లోకేశ్ V/S వైఎస్ జగన్