CM Chandrababu Review on WhatsApp Governance: ఏపీలో కొంత శకం ప్రారంభం కానుంది. రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ సేవల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజల చేతికే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి కావాల్సిందల్లా ఒక్క సెల్‌ఫోన్ మాత్రమే. పౌరులకు ఏం కావాలన్న ఫోన్లోనే ఒక్క క్లిక్‌తో ప్రభుత్వ పాలన ఫలాలు అందుబాటులోకి వస్తాయి.
దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టనున్న ఈ వాట్సాప్ గవర్నెన్స్‌తో తొలి విడుతలో 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సప్ గవర్నెన్స్‌తో ప్రజా జీవన శైలిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. హైటెక్ సీఎంగా కీర్తి గడించిన చంద్రబాబు రాష్ట్రంలో ఈ విధానంను అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా వేగంగా పాలనా ఫలితాలు అందేందుకు ఈ విధానం ఎంతగానే దోహదపడుతుందని వారు తెలిపారు.
వాట్సప్ గవర్నెన్స్ అమలు పై సీఎం చంద్రబాబు ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులందరు హజరయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయి - మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు: తెలంగాణ మంత్రి
ప్రభుత్వ సమాచారం చేరవేత:ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సప్ ఖాతా ద్వారా సందేశం పంపిస్తుంది.
ఉదాహరణలు:
- భారీవర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం.
- మీ ప్రాంతంలో విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతుల కారణంగా ఫలానా సమయంలో విద్యుత్తు సరఫరా ఉండదు.
- వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోండి.
- మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.
- మీ ప్రాంతంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి లాంటి సమాచారాన్ని ఒకేసారి కోట్లమంది ప్రజలకు చేరవేస్తారు.