ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

50 కోట్ల ఆస్తిని కొట్టేసే కుట్ర - 'హత్యను గుండెపోటుగా చూపిన ఐపీఎస్​లు' - చంద్రబాబుకు బాధితురాలి ఫిర్యాదు - Women Complaint on IPS to CM - WOMEN COMPLAINT ON IPS TO CM

CM Chandrababu Naidu Receiving Requests From People : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆస్తి కోసం కొందరు తమ కుమారుడిని హత్య చేస్తే.. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌గున్నీ గుండెపోటు మరణంగా కేసును పక్కదారి పట్టించారని ఓ మహిళ సీఎం చంద్రబాబు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

CM Chandrababu Naidu Receiving Requests From People
CM Chandrababu Naidu Receiving Requests From People (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2024, 9:49 AM IST

CM Chandrababu Naidu Receiving Requests From People : పాలనపరమైన అంశాలు, సమీక్షలతో క్షణం తీరిక లేనప్పటికీ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన విజయారాణి తన కుమారుడికి జరిగిన అన్యాయంపై సీఎంను కలిసి బోరున విలపించారు. 50 కోట్ల ఆస్తి కొట్టేసే కుట్రలో భాగంగా తన కొడుకు హత్య జరిగితే అప్పటి విజయవాడ కమిషనర్‌ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌గున్నీ గుండెపోటు మరణమని పేర్కొంటూ కేసును పక్కదారి పట్టించారని ఆరోపించారు. 19 నెలలుగా న్యాయం కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. కేసులో తనకు న్యాయం చేయాలని కోరారు. కేసును మళ్లీ విచారించి న్యాయం చేస్తానని బాధితురాలికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దివ్యాంగులు, వృద్ధుల సాదకబాధకాలను ఆయన ఓపిగ్గా విన్నారు. వినతులను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తన పేషీ అధికారులను ఆదేశించారు.

'తప్పుడు పత్రాలతో స్థలం రిజిస్ట్రేషన్​' - కొడాలి నాని అనుచరుడిపై బాధితుడు ఫిర్యాదు - Grievance at TDP Office

ఫిర్యాదుల వెల్లువ : వారసత్వంగా ఇచ్చిన 2 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆక్రమించి, దొంగ పట్టాలు సృష్టించారని పల్నాడు జిల్లా పమిడిమర్రుకు చెందిన గుర్రపుశాల శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో పైవంతెన నిర్మించకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు రావడం లేదని అరకు మండలంలోని పెదబులుడు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు, విజయవాడ జాతీయ రహదారిపై గోవుల అక్రమ రవాణా జరుగుతోందని, దీన్ని అరికట్టేందుకు మంగళగిరి సమీపంలో గోశాలను ఏర్పాటు చేయాలని కృష్ణధర్మ రక్షణ సమితి నాయకులు కోరారు. వినతులను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన పేషీ అధికారులను ఆదేశించారు.

మహిళలకు గుడ్ న్యూస్ - ఉచితంగా మూడు సిలిండర్లు - ప్రతి కుటుంబానికి లబ్ధి! - AP Free Gas Cylinder Scheme

విరాళాలు - సీఎం అభినందన : వరద బాధితుల సహాయార్థం తుళ్లూరుకు చెందిన ఆలూరి వెంకటరావు, ఆదినారాయణ 50 వేల రూపాయల చొప్పున విరాళం అందించారు. ఎం.శ్యామలరావు కె.రాజేశ్వరి 25 వేల చొప్పున, విజయనగరానికి చెందిన కె.హారిక 15వేలు విరాళం అందించారు. దాతలను చంద్రబాబు నాయుడు అభినందించారు.

మాజీ మంత్రి రజనీ అవినీతి దందా- హోంమంత్రికి ఫిర్యాదు చేసిన బాధితులు - Complaint on Vidadala Rajini

ABOUT THE AUTHOR

...view details