CM Chandrababu Open Letter to Pensioners: ఎన్నికల చెప్పినట్లుగా పెన్షనర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టకోవడం సంతోషంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆనందాన్ని వారికి బహిరంగ లేఖ ద్వారా పంచుకున్నారు. జూలై 1న ఇళ్ల వద్దే పింఛను ఇచ్చే కార్యక్రమాన్ని అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరపాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం, ఈమేరకు తన భావాలను లేఖ ద్వారా పంచుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని చంద్రబాబు తేలచ్చిచెప్పారు.
ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తమ ప్రభుత్వ తక్షణ, ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనుదారులకు బహిరంగ లేఖ రాశారు. అందరి మద్దతుతో ప్రజలకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని స్పష్టంచేశారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1000 పెంచి ఇకపై 4000 ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
'పరదాల మాటున తిరిగేవారికి 986 మంది సెక్యూరిటీ అవసరమా? - మనం ప్రజా సేవకులం మాత్రమే' - Jagan Security
ప్రజా శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం:దివ్యాంగులకు 3000 పెంచి ఇక నుంచి 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతున్నా ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామన్నారు.