Chandrababu Naidu Meets Niti Aayog CEO BVR Subramanyam :వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 (Vikasit Andhra Pradesh 2047) కోసం విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ప్రతినిధులతో సమావేశమయ్యారు.
వికసిత్ భారత్-2047 (Vikasit Bharat2047)కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై నీతి ఆయోగ్‌తో చర్చించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ ప్రణాళికపై నీతి ఆయోగ్ సీఈవో, ప్రతినిధులు, నిపుణులతో సీఎం సమావేశం అయ్యారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తన గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ ఆలోచనలను నీతి ఆయోగ్‌తో పంచుకున్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఏపీ పని చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వాలు విజన్‌తో పని చేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు, విజన్‌తో వచ్చిన ఫలితాలు చూశామని, నేడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలని అన్నారు. వినూత్న ఆలోచనతో, టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలని, అందుకు అనుగుణంగా వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ విజన్-2047 సిద్ధం చేయాలని సూచించారు. జనాభా సమతుల్యతపై లోతైన కసరత్తు చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు.
చంద్రబాబుతో నీతిఆయోగ్ భేటీ (ETV Bharat) విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు- వికసిత్ ఆంధ్రా మా నినాదం: సిద్ధార్థనాథ్ సింగ్ - BJP Sidharth Nath Singh Comments
రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో అన్ని రంగాల్లో విప్తవాత్మక మార్పులు వస్తాయని, అమరావతి, వైజాగ్ ఎఐ హబ్స్‌గా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నామని, ప్రతి సామాన్యుడికీ ఫలాలు అందాలని, రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు ఒక యునిట్‌గా ప్రణాళికలు రచించాలని, అప్పుడే విజన్ డాక్యుమెంట్ కు సార్థకత చేకూరుతుందని తెలిపారు.
వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రజలు ఓటు వేశారు: పురందేశ్వరి - BJP State Executive Meeting
వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటు, ప్రకృతికి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలని సీఎం తెలిపారు. సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారు. రాష్ట్ర ప్రగతిలో కీలకమైన విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయని, వాటికి అనుగుణంగా వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలని అన్నారు.
15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాలని చంద్రబాబు అన్నారు. 15 శాతం వృద్ది రేటు సాధించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. దీన్ని సాధించడానికి అవసరమైన సెక్టార్లలో అమలు చేయాల్సిన ప్రణాళికలు కీలకమని, మానవ వనరుల విషయంలో నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలి. దీని కోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్ రూపొందించాలని అన్నారు.
2047 వికసిత్ భారత్ కోసం పెద్ద ప్రణాళికలు- ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు : మోదీ - Modi Interview Lok Sabha Polls