ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు - CM Chandrababu met Modi - CM CHANDRABABU MET MODI

CM Chandrababu met with PM Modi: దిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత హోంమంత్రి, ఆర్థికశాఖల మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. దిల్లీలోని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యాలయాన్ని సందర్శించి ఏపీలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ఆరా తీశారు.

cm_chandrababu_met_modi.
cm_chandrababu_met_modi. (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 5:17 PM IST

Updated : Aug 17, 2024, 6:23 PM IST

CM Chandrababu met with PM Modi:దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన బిజిబిజీగా సాగుతోంది. కాసేపటి క్రితం ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై ఇరువురు చర్చించారు. అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్రం సహకారాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం సమావేశం అవుతారు.

రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటు:సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఏపీలో విమానయానరంగ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటు, వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర పౌరవిమానయానశాఖ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు.

Last Updated : Aug 17, 2024, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details