ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిన్నారికి అనారోగ్యం - అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు - CM Chandrababu Help To Child

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

CM Chandrababu Helps a Child Suffering from Typhoid: ఇది దోపిడీ ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వమని మరోసారి రుజువైంది. ఆనారోగ్యం బారిన పడిన చిన్నారి కోసం ఏకంగా వైద్యబృందాన్నే సీఎం చంద్రబాబు ఇంటికి పంపారు. మూడేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తన పేషీ అధికారుల్ని క్షేత్రస్థాయిలోనే నిమగ్నమయ్యేలా సీఎం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆసుపత్రి యాజమాన్యంతో వాకబు చేసిన సీఎంఆర్‌ఎఫ్‌ బృందం ముఖ్యమంత్రికి నివేదిస్తూ వచ్చింది.

cm_help_to_kid
cm_help_to_kid (ETV Bharat)

CM Chandrababu Helps a Child Suffering from Typhoid:ఓ చిన్నారి కోసం సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. టైఫాయిడ్​తో బాధపడుతున్న బాధిత బాలుడి కోసం వైద్యబృందాన్ని ఇంటికే పంపారు. అనంతరం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు వెంటనే ఎల్ఓసీ ఇప్పించారు. మూడేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తన పేషీ అధికారుల్ని క్షేత్రస్థాయిలోనే నిమగ్నమయ్యేలా సీఎం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆసుపత్రి యాజమాన్యంతో వాకబు చేసిన సీఎంఆర్‌ఎఫ్‌ బృందం ముఖ్యమంత్రికి నివేదిస్తూ వచ్చింది.

విజయవాడలోని పాతరాజేశ్వరిపేటలో 3 ఏళ్ల బాలుడు దేవాన్ష్ అనారోగ్యానికి గురయ్యాడు. టైఫాయిడ్​కు పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. జ్వరం తీవ్రతతో 14 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4 శాతానికి పడిపోవటంతో దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విషయం సీఎం దృష్టికి రావటంతో వెంటనే తన పేషీ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎలాగైనా దేవాన్ష్ ప్రాణాలను కాపాడాలని సీఎంఆర్‌ఎఫ్‌ విభాగాన్ని ఆదేశించారు. వైద్య బృందాన్ని నేరుగా బాధితుడి ఇంటికి పంపి పరీక్షలు చేయించిన సీఎం పేషీ మెరుగైన చికిత్సకు యుద్ధప్రాతిపదికన ఎల్ఓసి ఇచ్చి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది.

11 రోజులపాటు చికిత్స అనంతరం దేవాన్ష్ కోలుకున్నాడు. చికిత్స అందుతున్న 11 రోజులూ సీఎంకు దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితిని సీఎంవో నివేదించింది. పూర్తి ఆరోగ్యవంతుడై దేవాన్ష్ తల్లిదండ్రులతో ఇంటికి చేరుకున్నాడు. తమ బిడ్డకు పునర్జన్మ నిచ్చిన సీఎం చంద్రబాబుకు, చొరవ తీసుకుని ఫాలో అప్ చేసిన సీఎం పేషీ అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నారికి అనారోగ్యం - అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు (ETV Bharat)

భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయ్‌ - స్వామివారికి అపచారం తలపెట్టే మాటలు, చేతలు చేయం: చంద్రబాబు - Chandrababu on Tirumala Laddu

మానవత్వాన్ని చాటుకున్న లోకేశ్: మంత్రి నారా లోకేశ్​ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం నాగరాజు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని, ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు వైద్యానికి సాయం అందించి తమ కుమారుడుకి ప్రాణాపాయం నుంచి తప్పించాలని ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేశ్​కు విన్నవించారు. వెంటనే స్పందించిన లోకేశ్​ సీఎంఆర్ఎఫ్ ద్వారా 7 లక్షల రూపాయల సాయం అందించి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్ లో తమ కుటుంబానికి అండగా నిలిచిన లోకేశ్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని మంత్రి భరోసా ఇచ్చారు.

ఎదురుదాడులకు దిగితే తాటతీస్తా - ప్రతి నెలా 'పేదల సేవలో' : సీఎం చంద్రబాబు - CM Chandrababu Tour

చంద్రబాబు ఓపిక ఆశ్చర్యపరుస్తోంది - సీఎం నాయకత్వంలో పని చేయడం సంతోషం : పవన్​ కల్యాణ్​ - PAWAN KALYAN ABOUT CM CHANDRA BABU

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details