ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - chandrababu Condolence to ds - CHANDRABABU CONDOLENCE TO DS

CM Chandrababu Condolence to Dharmapuri Srinivas: తెలంగాణ  కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ సంతాపం ప్రకటించారు. డీఎస్‌ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని కొనియాడారు.

CM Chandrababu Condolence to Dharmapuri Srinivas
CM Chandrababu Condolence to Dharmapuri Srinivas (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 11:05 AM IST

CM Chandrababu Condolence to Dharmapuri Srinivas :తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్​, గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

హూందాగా రాజకీయాలు చేసేవారు :తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం ప్రకటించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ధర్మపురి శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. డీఎస్‌ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని అన్నారు. డీఎస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.

హైదరాబాద్​లోని నివాసానికి డీఎస్ భౌతికకాయం - ఆదివారం అంత్యక్రియలు

పార్టీకి విశిష్ట సేవలు అందించారు :కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పార్టీకి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డీఎస్‌ పార్థివ దేహానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు.

రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు :కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాక‌రమని వారి స్మృతికి మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారని గుర్తు చేశారు. ధర్మపురి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు లోకేశ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత - Dharmapuri Srinivas Died

ABOUT THE AUTHOR

...view details