ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు

స్వగ్రామం నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు

Nara Ramamurthy Naidu Last Rites
Nara Ramamurthy Naidu Last Rites (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Nara Ramamurthy Naidu Last Rites :సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. నేడు స్వస్థలం నారావారిపల్లెలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తల్లిదండ్రులు అమ్మణ్నమ్మ, ఖర్జూరనాయుడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే రామ్మూర్తి అంతిమసంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. లోకేశ్​ను, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లె చేరుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణ కూడా చేరుకున్నారు.

మరోవైపు శనివారం కన్నుమూసిన నారా రామ్మూర్తినాయుడు గురించి ఆయన తనయుడు, సినీనటుడు నారా రోహిత్‌ ఎక్స్‌లో భావోద్వేగ పోస్టు పెట్టారు. 'మీరొక ఫైటర్‌ నాన్నా మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాన్నా నాకు ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నేర్పించారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి మీరే కారణం. ప్రజలను ప్రేమించడంతో పాటు మంచి కోసం పోరాడాలని చెప్పారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు. నాన్నా మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు బై నాన్నా' అని నారా రోహిత్ ట్వీట్ చేశారు.

Ramamurthy Naidu Passed Away :రామ్మూర్తినాయుడు 1952లో నారా ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు జన్మించారు. సీఎం చంద్రబాబు ఆయన సోదరుడు. రామ్మూర్తి నాయుడు ఎస్వీ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఏ చేశారు. 1992 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై విజయం సాధించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

2003లో దిల్లీలో అప్పటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో రామ్మూర్తినాయుడు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ హైకమాండ్ 2004లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో విభేదించారు. అనంతరం చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందారు. తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

నారా రామ్మూర్తినాయుడు కన్నుమూత - నేతల సంతాపం

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details