CM Chandrababu Davos Tour Updates : దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, అధికారుల బృందం జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ వారికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలోనే విమానాశ్రయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుకున్నారు.
జ్యూరిచ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం - CM CHANDRABABU DAVOS TOUR
జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం - విమానాశ్రయంలో వారికి ఘనస్వాగతం పలికిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2025, 4:32 PM IST
|Updated : Jan 20, 2025, 5:22 PM IST
Chandrababu Meets Revanth Reddy : ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. అనంతరం చంద్రబాబు బృందం విమానాశ్రయం నుంచి హిల్టర్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ భారత రాయబారి మృదుల్‌కుమార్‌తో సీఎం బృందం భేటీ అయింది. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో వారు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం తెలుగువారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్‌కి చంద్రబాబు వెళ్లనున్నారు.
7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు - ఇకపై అన్నీ మంచి రోజులే: చంద్రబాబు