తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రో రెండోదశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

CM Approval to Hyderabad Metro Phase 2 Works : హైదరాబాద్​లోని మెట్రో రెండోదశ విస్తరణ ప్రతిపాదనలకు, సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా ఫేజ్​ 2 కారిడార్​ కోసం వేగంగా ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్​ల తయారీ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రాజధానిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మెట్రో సేవలు దోహదం పడతాయని ఎండీ పేర్కొన్నారు.

Hyderabad Metro Phase 2 Route Map Expansion
CM Approval to Hyderabad Metro Phase 2 Works

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 3:10 PM IST

CM Approval to Hyderabad Metro Phase 2 Works :హైదరాబాద్​లో మెట్రోరైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని(Shamshabad Airport) కలుపుతూ 70 కిలోమీటర్ల మేర రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఇందుకు సంబంధించిన ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్​ల తయారీ శరవేగంగా జరుగుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఇటీవల సీఎం ఆదేశాల మేరకు ఫేజ్​ 2 రూట్ మ్యాప్​, 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా మెట్రో అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా మెట్రో రైలు భవన్​లో ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశం కోసం పోరాడి అమరులైన త్యాగమూర్తులకు నివాళులర్పించి, హైదరాబాద్​లో మెట్రోరైలు ప్రగతిని వివరించారు.

Hyderabad Metro Phase 2 Route Map Expansion :ఫేజ్ 2 లో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాలకు అందుతాయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు అవి ఆకర్షణీయం అవుతాయని పేర్కొన్నారు. హెచ్ఎంఆర్ఎల్ ఇంజినీర్లు, ఉద్యోగులు తమను తాము పునరంకితం చేసుకోవాలని, వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఖరారైన రూట్ మ్యాప్ - కొత్తగా 70 కి.మీ. మేర నిర్మాణ ప్రతిపాదనలు

హైదరాబాద్​ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్​ - మూసీ నది అభివృద్ధే ప్రధానం

ABOUT THE AUTHOR

...view details