తెలంగాణ

telangana

ETV Bharat / state

మీసేవలో ఇచ్చే రశీదు సివిల్​ సప్లై ఆఫీసులో ఇవ్వాల్సిన అవసరం లేదు : పౌరసరఫరాల శాఖ స్పష్టత - TELANGANA RATION CARD UPDATES

రేషన్‌కార్డులకు దరఖాస్తుల్లో గందరగోళం - మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్న ప్రజలు - రశీదు సివిల్​ సప్లై ఆఫీసులో ఇవ్వాల్సిన అవసరం లేదన్న పౌరసరఫరాల శాఖ

Heavy Rush At Mee Seva Centers For Ration Card Application
Heavy Rush At Mee Seva Centers For Ration Card Application (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 2:12 PM IST

Telangana Ration Card Updates :రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై సర్కారు స్పష్టత ఇచ్చింది. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మీ-సేవా కేంద్రాల వద్ద కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆయా సెంటర్ల వద్ద రద్దీ, గందరగోళం కొనసాగుతోంది. ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు ఏమీ లేదని, విధించలేదని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ, ఔత్సాహిక దరఖాస్తుదారులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన కుల గణన, ప్రజాపాలన సహా జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ప్రజావాణి లేదా మండల కేంద్రాలు, పురపాలక సంఘాల్లో దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే ఆయా దరఖాస్తుల అర్హతలపై నిశితంగా పరిశీలన సాగుతోంది. ప్రస్తుతం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తుల కోసం ఒక్కసారిగా రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే చాలా మీ - సేవా కేంద్రాల్లో రద్దీ కొనసాగుతోంది. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

మీ సేవ స్లిప్​ మీ దగ్గరే ఉంచుకొండి : అలాగే మీ-సేవ సిబ్బంది కొరత కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతా ఒక్కసారి కాకుండా ఒక్కొక్కరూ తీరిక వేళల్లో సమయం తీసుకుని మెల్లగా వచ్చి దరఖాస్తులు చేసుకోవచ్చని, ఆ దరఖాస్తులు ఎంట్రీ తర్వాత మీ-సేవ కేంద్రాల్లో ఇచ్చే స్లిప్​ అభ్యర్థుల వద్ద పెట్టుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టంగా చెప్పింది. తొందరపడి కంగారుగా ఆ ఎంట్రీ రిసిప్ట్‌ పౌరసరఫరాల శాఖ లేదా చౌక ధరల దుకాణాల్లో ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించింది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులెవరూ కూడా ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని తేల్చిచెప్పింది.

గందరగోళం : రేషన్​కార్డులకు దరఖాస్తుల్లో కాస్త గందరగోళం నెలకొంది. రేషన్​కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్న వారు, రసీదును సివిల్​ సప్లై ఆఫీసులో ఇవ్వాలని మీసేవ నిర్వాహకులు చెప్పారు. రసీదులు తీసుకుని సివిల్​ సఫ్లై కార్యాలయానికి ప్రజలు వెళుతున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలు, సివిల్​ సప్లై కార్యాలయం వద్ద రద్దీ భారీగా పెరిగిపోయింది. రెండు చోట్ల గంటలకొద్దీ ప్రజలు వేచి ఉండాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవలో దరఖాస్తు చేసిన తర్వాత మళ్లీ రసీదు ఎందుకు ఇవ్వాలని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ స్పష్టతను ఇచ్చింది.

కొత్త రేషన్​కార్డుల దరఖాస్తులకు జనాలు క్యూ - జాతరను తలపిస్తున్న 'మీ-సేవ' కేంద్రాలు

కొత్త రేషన్‌కార్డుల కోసం మీ-సేవకు వెళ్తున్నారా? - ఇది తెలుసుకోకపోతే మీకే కష్టం

ABOUT THE AUTHOR

...view details