Summer Vacation For Students :కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అనుకుంటూ కొందరు, చాలా కష్టంగా పిల్లలందరూ స్కూల్‌కు వెళ్తుంటారు. సంవత్సరం పాటు టీచర్ల తన్నులు, హోం వర్కుల భారాలు, స్కూల్ రూల్స్ భరించలేక విసిగిపోయిన వారంతా.. ఇవాళ్టి నుంచి "ఫ్రీ బర్డ్స్" అయిపోతారు. స్వేచ్ఛగా విహరించేందుకు ఎంతగానో ఉవ్విళ్లూరుతుంటారు. కొందరు బంధువుల ఇళ్లకు పయనమైతే, మరికొందరు సమ్మర్ క్యాంపుల్లో చేరిపోతారు. ఇంకొందరు ఇంట్లోనే సందడి చేస్తుంటారు. అయితే.. ఎవరు ఎక్కడ ఉన్నా సరే, ప్రమాదాల తీవ్రత తెలియని పిల్లలు అపాయాల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే.. పెద్దలు వారిని కనిపెట్టుకుంటూ ఉండి తీరాల్సిందే. స్వేచ్ఛ ఇస్తూనే కాస్త కట్టడి చేయాల్సిందే. లేదంటే.. ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎంతగా బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే.. వేసవి సెలవుల్లో పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.
చెరువుల్లో, బావుల్లో ఈతకు పంపించవద్దు :
గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు బావుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడిని తట్టుకోలేక కొందరు పెద్దలు వెళ్తుంటే.. వారి వెంట పిల్లలు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. పక్కన ఉన్నవాళ్లు వీరిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారనేది చెప్పలేం. ఒకవేళ చూసుకున్నా.. ఈత రాకుండా బావుల్లోకి, చెరువుల్లోకి దిగడం అత్యంత ప్రమాదం. కాబట్టి.. ఈత రాని మీ పిల్లలను పంపకండి. అవకాశం ఉంటే మీరే తీసుకెళ్లండి. ఈత నేర్పండి. అది అవసరం కూడా. కానీ ఒంటరిగా పంపొద్దు.
బైక్ ఇవ్వకండి :
పట్టణాలు, నగరాల్లోని పిల్లలు వాహనాలతో ఎక్కువగా అటాచ్ మెంట్ కలిగి ఉంటారు. పక్కవారిలా తామూ రయ్య్‌మంటూ దూసుకెళ్లాలని ఆశపడుతుంటారు. అందుకే ఈ సెలవుల్లో ఎలాగైనా బైక్ నడపడం నేర్చుకోవాలని మారాం చేస్తుంటారు. అవకాశం ఉంటే మీరే నేర్పండి. లేదంటే తర్వాత నేర్పిస్తానని చెప్పండి. అంతేగానీ మీరు లేకుండా బండి చేతికి ఇవ్వకండి.
చెప్పి వెళ్లమనండి :
ఈ రోజుల్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది తల్లిదండ్రులకు పెద్దగా తెలియట్లేదు. కాబట్టి.. ఫ్రెండ్స్‌తో వెళ్తామంటే ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోండి. ఎప్పుడు వస్తారో అడగండి. మానిటర్ చేస్తున్నారని తెలిస్తేనే కాస్త జాగ్రత్తగా ఉంటారు. అలాగని అథారిటీ ఉపయోగించకండి. ఫ్రెండ్లీగా ఉంటూనే విషయాలు తెలుసుకోవాలి.
ఎండకు వద్దు :