ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ జగన్‌కు చంద్రబాబు ఫోన్‌ కాల్‌ - Chandrababu Phone Call to YS Jagan

Chandrababu Phone Call to YS Jagan: అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పలువురు నేతలకు చంద్రబాబు ఆహ్వానం పంపుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సైతం చంద్రబాబు ఫోన్ చేశారు. జగన్​ ను స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే, జగన్ ఫోన్ కాల్​కు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

Chandrababu Phone Call to YS Jagan
Chandrababu Phone Call to YS Jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 7:50 PM IST

Updated : Jun 11, 2024, 8:32 PM IST

Chandrababu Phone Call to YS Jagan:అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పలువురు నేతలకు చంద్రబాబు ఆహ్వానం పంపుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సైతం చంద్రబాబు ఫోన్ చేశారు. జగన్​ ను స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే, జగన్ ఫోన్ కాల్​కు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

జగన్​కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం పొందిన నేఫథ్యంలో 12వ తేదీన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి నేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రిలను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. ఏపీలో కూటమి నేతలతో పాటుగా, ప్రముఖులు, వివిధ పార్టీల నేతలకు ఆహ్వానం పంపుతున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకోసం స్వయంగా చంద్రబాబు నాయడు జగన్​కు ఫోన్ చేశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని జగన్‌ను ఆహ్వానించేందుకు చంద్రబాబు యత్నించారు. జగన్ మాత్రం చంద్రబాబు ఫోన్ కాల్‌కు అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని వైఎస్సార్సీపీ నిర్ణయించినట్లు సమాచారం. అందువల్లనే జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ నేతలకు గవర్నర్​ ఆహ్వానం- సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం - NDA Leaders meet governor

విదేశీ ప్రముఖులు: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రతినిధులు సైతం రానున్నారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు పలు విదేశీ సంస్థల ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొరియా కాన్సులేట్‌ జనరల్‌,(Korea Consulate General) జపాన్, సింగపూర్, దక్షిణకొరియా, నెదర్లాండ్స్‌ కాన్సులేట్ జనరల్స్‌కు ఆహ్వానం పంపించారు. ఆయా రాయబార కార్యాలయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆహ్వానం పంపించారు. ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇప్పటికే ఆయా దేశాల ప్రతినిధులు గన్నవరం చేరుకున్నారు.

రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ- అధినేత ఫోన్‌కాల్‌ కోసం ఆశావహుల ఎదురుచూపు - Chandrababu Naidu cabinet

Last Updated : Jun 11, 2024, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details