Chandrababu Oath Ceremony As Andhra Pradesh CM :ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు.
Pawan Kalyan Took Oath As AP Minister : అనంతరం ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్‌కల్యాణ్ అనే నేను అని ఆయన అనగానే అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది. మరోవైపు పవన్ ప్రమాణం చేస్తుండగా ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రేమగా ఆయన్నే చూస్తూ మురిసిపోయారు. ఆ తర్వాత ఏపీ మంత్రిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ రెండోసారి ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తుండగా సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బి.సి.జనార్దన్‌రెడ్డి, టి.జి.భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.