Tirumala MLA Quota Tickets Increased : తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖల పెంపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాల కోటాను పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఇకపై వారంలో ఆరు రోజులు పాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్‌లు) ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుమల దర్శనాలకు సంబంధించి ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. అయితే ఇకపై వాటిని ఆరు రోజులకు అనుమతించనున్నారు.
ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - ఆ కోటా టికెట్లు పెంపు - TIRUMALA MLA QUOTA TICKETS INCREASE
తిరుమల దర్శనం సిఫార్సు లేఖలు పెంపు
Tirumala MLA Quota Tickets Increased (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2024, 12:55 PM IST