Chandrababu fired at Peddireddy: పుంగనూరు ప్రజలకు ఇవాళే స్వాతంత్ర్యం వచ్చిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే వ్యక్తి చల్లా బాబు అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్దిరెడ్డికి పోలిక ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి ఆధిపత్యానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్‌పెడతారని, కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ అయ్యాక, పెద్దిరెడ్డికి నిద్ర ఉండదని హెచ్చరించారు. మామిడికాయల కొనుగోలులో కమీషన్లు కొట్టేశారని, ఇసుక, మద్యం వ్యాపారం మెుత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే అన్నారు. అవినీతి చేసి రూ.30 వేల కోట్లు కొట్టేశారని, అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధించారని చంద్రబాబు మండిపడ్డారు.
రామచంద్రయాదవ్, పెద్దిరెడ్డి స్వగ్రామానికి వెళ్తే దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. చల్లా బాబుపై అక్రమ కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి అవినీతిపై ప్రశ్నించిన తనపై కేసులు పెట్టించారని పేర్కొన్నారు. అంగళ్ల ఘటనలో 400 మందిపై కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడే అంటూ ఎద్దేవా చేశారు. పెంచిన మద్యం ధరల్లో పెద్దిరెడ్డి ( Peddireddy ), జగన్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. 2019లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చాక కరెంట్ ధరలు పెంచారు. జగన్ సీఎం అయ్యాక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతపండుకు ఎక్కవ ధర ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.