Chakali Ilamma Women's University Professors Team Invented Green Coffee For Control Blood Sugar :మీకు కాఫీ అంటే చాలా ఇష్టమా, ఫుడ్లేకపోయినా పర్లేదుగానీ రోజుకు రెండు కప్పుల కాఫీ పడాల్సిందే అంటారా? అయితే ఈ తియ్యని కబురు మీకోసమే. ఈ ఫార్ములాతో తాము రూపొందించిన కాఫీ కేవలం ఆస్వాధించడానికే కాదు మీ ఆరోగ్యానికి బహుళ ప్రయోజనకారినిగా ఉపయోగపడుతుందని అంటున్నారు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర ఆచార్యులు జయసూర్యకుమారి, శ్రీవల్లి, ఎం.స్రవంతి.
వీరు తయారు చేసిన ఫార్ములా కాఫీ తాగడం వల్ల ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుందని, శరీర బరువును తగ్గిస్తుందనీ తెలుపుతున్నారు. ఈ మేరకు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులపై చేసిన ప్రయోగాలు విజయవంతమైన ఫలితాలివ్వడంతో ఈ గ్రీన్ కాఫీకి సంబంధించిన ఫార్ములా విషయమై పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఐదేళ్లలో కాఫీ సాగు విస్తృతం- కార్యాచరణ సిద్ధం - Expand Coffee Cultivation
ఈ కాఫీని రోజుకొకసారి తాగినా చాలంట! :ఈ గ్రీన్‌కాఫీని రోజుకు ఒకసారి తాగినా మనకు మంచి ఆరోగ్య ఫలితాలుంటాయని వారు తెలిపారు. అందులోని క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇది శరీరంలోని హానికారక కొవ్వును హరిస్తుంది. ఇది జీవక్రియను పెంచడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంటున్నారీ ప్రొఫెసర్లు. వారి ప్రయోగాల్లో 90 శాతం మందికి శరీర బరువు తగ్గిందని రసాయన శాస్త్ర ఆచార్యులు తెలుపుతున్నారు. టైప్-2 మధుమేహం తీవ్రత కూడా తగ్గించవచ్చని దీని అంటున్నారు. మార్కెట్ చేసేందుకు వాణిజ్య సంస్థలు ముందుకొస్తే తయారీ విధానాన్ని వివరించి గ్రీన్‌కాఫీని విక్రయిస్తామని ప్రొఫెసర్ జయసూర్యకుమారి వివరించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని సంప్రదాయ కాఫీ తోటల నుంచి గ్రీన్ కాఫీ గింజలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
మీకు తెలుసా ఇదో ఐస్ కాఫీ కానీ! :గ్రీన్ కాఫీ అంటే ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతోంది. మరిగించిన వేడినీళ్లలో దీన్ని వేసుకుని తాగుతారు. అయితే మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు రూపొందించిన కాఫీ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఐస్ కాఫీ తరహాలో ఒక ప్రత్యేక ఫార్ములాతో దీన్ని తయారు చేస్తారు. కాఫీ గింజలను నిర్ణీత ఉష్ణోగ్రతలో శీతలీకరణ చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ప్యాక్‌లలోని శీతలపానీయం తరహాలో ఉంటుంది. ఈ గ్రీన్‌కాఫీని ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తాగొచ్చు. వేడినీళ్లతో కలిపి వేడిగానూ తాగొచ్చు. దేశంలో తాము రూపొందించిన పద్ధతిలో గ్రీన్ కాఫీని ఎవరూ తయారు చేయలేదని ప్రొఫెసర్ జయసూర్యకుమారి తెలిపారు.
"అరకు కాఫీ" అదుర్స్ - రైతుల కష్టాలకు చెక్ పెట్టిన టెకీ నిర్ణయం