ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో బైక్ కొట్టేసి తునిలో చైన్ స్నాచింగ్ - "షాకింగ్ విజువల్స్" - CHAIN SNATCHING IN TUNI

చోరీ చేసిన బైక్‌తో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన యువకులు

Chain Snatching in Tuni
Chain Snatching in Tuni (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2024, 2:48 PM IST

Tuni Chain Snatching Video Viral :ఏపీలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పడిన కొందరు యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. "దొరికితే దొంగ దొరక్కపోతే దొర" అన్నట్లు సాగుతుంది వీరి వ్యవహారం. ఆ క్షణానికి చేతిలో డబ్బులు లేకపోతే ఇటువంటి మార్గాలను ఎంచుకుని ఎదుటివారి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాకుండా స్థానికంగా నివాసం ఉండే కొంత మంది యువకులు సైతం ఇటువంటి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు.

ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులకే సవాల్ విసురుతూ ఎంతో చాకచక్యంగా ఇటువంటి పనులు కానిస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు చోరీ చేసిన బైక్‌తో సినీ ఫక్కీలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన కాకినాడ జిల్లాలో తునిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

వెలమ కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ తునిలో నడిచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఎదురుగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకడు లక్ష్మీ మెడలోని బంగారు ఆభరణాలను చాకచక్యంగా లాకున్నాడు. అనంతరం అక్కడి నుంచి బైక్​తో వారు పరారయ్యారు. ఈ పరిణామంతో బాధితురాలు ఒక్కసారిగా షాక్​ గురైంది. వెంటనే తేరుకున్న సదరు మహిళ కేకలు వేసింది. ఇది గమనించిన స్థానికులు అక్కడికి వచ్చేలోగా దొంగలు పారిపోయారు.

Chain Snatching in Tuni : ఈ ఘటనపై బాధితురాలు తుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తునిలో చోరీకి పాల్పడిన యువకులు విశాఖపట్నంలో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అదే వాహనంపై చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇప్పుడుస ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వరస దొంగతనాల ఘటనలతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.

ముగ్గు వేస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ - సీసీటీవీలో దృశ్యాలు - Chain Snatching in Mangalagiri

టీ పొడి కోసం వచ్చి - బంగారు గొలుసుతో ఉడాయించాడు

ABOUT THE AUTHOR

...view details