ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద పరిస్థితిపై చంద్రబాబు కన్నీళ్లను గమనించా- రైతులను ఆదుకుంటామన్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ - Flood Affected Areas in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 3:33 PM IST

Central Minister Shivraj Singh Chouhan: వరద కారణంగా నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో ఆయన కృష్ణ జిల్లా కేసరపల్లికి వచ్చారు. బుడమేరు దెబ్బకు నిండా మునిగిన పంట పొలాలను పరిశీలించారు.

Central Minister Shivraj Singh Chouhan
Central Minister Shivraj Singh Chouhan (ETV Bharat)

Central Minister Shivraj Singh Chouhan :వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ పర్యటించారు. నేడు కృష్ణా జిల్లా కేసరపల్లిలో వరదల వలన దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తాను స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. రైతులు ఎలా కష్టపడతారో తెలుసునని అన్నారు. వారం రోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయని, వరి, మొక్కజొన్న, అరటి, కంద వంటి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.

Farmers Problems Due to Floods :నాలుగైదు రోజుల్లో నీళ్లు పోతే వరి పంట చేతికి వచ్చేదని, కానీ రోజుల తరబడి నీళ్ళు ఉండటం వల్ల పంట కుళ్లిపోయిందని శివరాజ్‌సింగ్ చౌహాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వరదలు కౌలు రైతులకు మరింత నష్టాన్ని కలిగిస్తాయని, పంట నష్టం వచ్చినా కౌలు రైతులు కౌలు చెల్లించాలని, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తాను స్వయంగా చూశానని అన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు, స్వంత భూమిలో వ్యవసాయం చేస్తున్న వారి ఇద్దరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రానికి అండగా ఉంటాం - కేంద్ర సాయం త్వరగా అందేలా చూస్తా: శివరాజ్‌సింగ్ - Shivraj Singh Chouhan on Floods

గత ప్రభుత్వంపై ఆగ్రహం : రైతులకు గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నిధులు చెల్లించలేదని ఆరోపించారు. దానివల్ల చాలమంది రైతులు ప్రభుత్వం సహాయం పొందలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరిగిన పంట నష్టంపై కేంద్రానికి వివరిస్తామని వెల్లడించారు. వరద నీరు పోయిన తరువాత రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు ఎరువులు, విత్తనాలు కూడా ఇస్తామని అన్నారు. రుణ సౌకర్యం పొందిన రైతుల గురించి కూడా ఆలోచన చేస్తామని తెలిపారు.

చంద్రబాబు ఆవేదన చెందుతున్నారు : వరదల వలన ప్రజలు, రైతులు పరిస్థితి చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందుతున్నారని, ఆయనతో మాట్లాడుతున్న సమయంలో కన్నీటిని గమనించానని శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు సున్నిత మనస్కులని పేర్కొన్నారు. వరదల వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోని అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంటుందని పేర్కొన్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన - Union Minister visit to Vijayawada

జాతీయ విపత్తుగా పరిగణించాలి :రాష్ట్రంలో వరద విలయాన్ని జాతీయ విపత్తుగా పరిగణించి సహకరించేలా సిఫార్సు చేయాలని రాష్ట్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు శివరాజ్ సింగ్ చౌహాన్​కు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో రాత్రి బస చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్​ను ఖమ్మం జిల్లా పర్యటనకు ముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలిసి పరిస్థితులను వివరించారు. వివిధ రైతు సంఘాల ప్రతినిధులు శివరాజ్ సింగ్​కు వినతిపత్రాలు అందజేశారు. రైతులు గడ్డు పరిస్థితిలో ఉన్నారని, భారీగా సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలపై వరద బాధితులు సంతృప్తిగా ఉన్నారని, కేవలం ప్రత్యర్ధి పార్టీలే ఆందోళన చెందుతున్నారని ప్రజాప్రతినిధులు విమర్శించారు.

దివిసీమను ముంచిన వరద- సాయం కోరుతున్న అన్నదాతలు - Farmers Problems Due to Floods

ABOUT THE AUTHOR

...view details