Bandi Sanjay Saved The woman :బైక్పై వెళ్తూ కిందపడి పోయి లారీ కింద ఇరుక్కుపోయి కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో తృటిలో ప్రాణాలు దక్కించుకున్న మహిళ స్టోరీ ఇది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ శివారులో ఉదయం ఓ ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం ఖెల్లడకు చెందిన దివ్యశ్రీ భర్తతో కలిసి హుజురాబాద్లో పని చేసుకొని స్వగ్రామానికి వెళ్తోంది. బైక్పై వెళ్తున్న సమయంలో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయి వెనుక వస్తున్న లారీ కిందకు వెళ్లింది.
ఈ ఘటనలో ఆమె జుట్టు లారీ ముందు టైర్, రాడ్ల మధ్య ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో డ్రైవర్ లారీని ఆపేశాడు. అదే సమయంలో అటుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ములుగు వెళుతూ ఘటనా స్థలి వద్ద ఆగారు. లారీ కింద టైర్ పక్కన రాడ్డులో జుట్టు చిక్కుకొని రక్తమోడుతూ వేళాడుతున్న దివ్యశ్రీని చూసి ధైర్యం చెప్పారు. ఇరుక్కుపోయిన జుట్టును కట్టర్ల సాయంతో కత్తిరించి దివ్యశ్రీని బయటకు తీయాలని అక్కడున్న వారికి సూచించారు. తరువాత రక్షించిన తరువాత కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. దివ్యశ్రీ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు బండి సంజయ్ ఫోన్లో చెప్పారు.