15 Thousand Crores for Amaravati : రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్రానికి పెద్ద ఊరట లభించింది. అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రకటించిన రూ.15,000ల కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. ఆ మొత్తంలో సుమారు రూ.13,440 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి కేంద్ర ఆర్థికశాఖ రుణంగా తీసుకుని, సీఆర్డీఏకు ఇవ్వనుంది. ఆ రెండు బ్యాంకులూ చెరో 80 కోట్ల డాలర్ల చొప్పున రుణం ఇస్తున్నాయి. రూ.15,000ల కోట్లలో బ్యాంకులు ఇచ్చేది పోగా మిగతా మొత్తాన్ని కేంద్రం సమకూరుస్తుంది.
రాజధాని అమరావతికిచ్చే రూ.15 వేల కోట్లు గ్రాంటే!
రాజధాని అమరావతి నిర్మాణ నిధుల విషయంలో రాష్ట్రానికి పెద్ద ఊరట
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2024, 6:48 AM IST
బ్యాంకులకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. అమరావతి కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రొగ్రాం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఆ రుణం ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాల్ని ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉంచింది. కేంద్ర ఆర్థికశాఖను రుణ గ్రహీతగా, సీఆర్డీఏను ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 'ప్రొగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్ " విధానంలో రుణం సమకూరుస్తున్నట్లు తెలిపింది. ఈ లెక్కన రూ.15,000ల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి రూ.15,000ల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి గ్రాంట్‌గానే వస్తోందని స్పష్టమవుతోంది.
జెట్ స్పీడ్‌గా అమరావతి నిర్మాణం - త్వరలోనే పోలవరం పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు