Two lakh insurance for 20 rupees :చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి అనుభవపూర్వకంగా తెలిసే ఉంటుంది. సరిగ్గా అలాంటిదే ఈ విషయం కూడా. బ్యాంకులో పొదుపు (Saving Account) ఖాతా ఉన్నవాళ్లకి రెండు జీవిత బీమా పథకాలు వర్తిస్తాయనే విషయం ఎక్కువ మందికి తెలియదు. కానీ, కేంద్ర ప్రభుత్వం రెండు రకాల సామాజిక భద్రత జీవిత బీమా పథకాలు అమలు చేస్తోంది. ఈ విషయంలో అవగాహన లేమి కారణంగా పేదలు లబ్ధి పొందలేకపోతున్నారు. ఏదైనా జాతీయ బ్యాంకుల్లో సేవింగ్ ఖాతా ఉన్న ప్రతి వినియోగదారుడి నుంచి 'ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన’ (PMSBY) కింద కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల విలువైన జీవితబీమా కల్పిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఖాతాదారుడు మరణిస్తే బ్యాంకులు రూ.2 లక్షల జీవిత బీమా పరిహారం చెల్లిస్తాయి. అయితే, బ్యాంకులో ఖాతా ఉన్న అందరికీ వర్తించదు. ఏడాదికోసారి రూ.20ని తన ఖాతా నుంచి మినహాయించుకోవాలని ఖాతాదారుడు బ్యాంకుకు రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేస్తేనే వర్తిస్తుంది. కొన్ని బ్యాంకులు ఈ లేఖను ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాయి. ఒక వేళ ఏదైనా సంవత్సరంలో ఆ లేఖ ఇవ్వడం మరిచిపోతే ప్రీమియం మినహాయింపు, బీమా నిలిచిపోతున్నాయి. అందుకే ఆటో డెబిట్ (Auto Debit) పేరుతో ఏటా ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటున్నాయి. దీనివల్ల ఏటా ఖాతాదారుడు ఏటా లేఖ ఇవ్వాల్సిన అవసరం రాదు.
రూ.755చెల్లిస్తే 15లక్షలు- ఈ జీవిత బీమా పాలసీ అస్సలు వదులుకోవద్దు - Health Insurance
జీవనజ్యోతికి ప్రీమియం ఎక్కువని
ఖాతాదారు సహజంగా లేదా అనారోగ్యం, ప్రమాద కారణాలతో మరణిస్తే 2 లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చేందుకు ‘ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన’ (PMJJBY) ను కూడా కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకంలో ప్రతి సంవత్సరం రూ.450 నుంచి రూ.500 వరకూ (బ్యాంకుల ఆధారం) ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.