CENTRAL GOVERNMENT FUNDS TO AP: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు కేంద్రం వాటా విడుదల చేసింది. రాష్ట్రాలకు 1,78,173 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను వాటా విడుదల చేసింది. అక్టోబరు, 2024లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ముందస్తు వాటాగా రూ. 89,086.50 కోట్లతో కలిపి మొత్తం రూ. 1,78,173 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
ఏపీకి 7 వేల 211 కోట్లు విడుదల చేసిన కేంద్రం - ఎందుకంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - ఏపీకి రూ.7,211 కోట్లు, తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2024, 3:17 PM IST
పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి అనుగుణంగా పన్నుల వాటా విడుదల చేశామని కేంద్రం తెలిపింది. అదే విధంగా రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందస్తు వాయిదాలు విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. కేంద్రం విడుదల చేసిన పన్నుల వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 7,211 కోట్లు, తెలంగాణకు రూ. 3,745 కోట్లు విడుదలయ్యాయి.