Central Budget Allocation Funds to Vizag Steel Plant :సెంట్రల్ గవర్నమెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు బడ్జెట్ల్లో రూ.620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే 63 కోట్లు రూపాయలను కోతపెట్టింది.
- ఏపీ పునర్విభజన చట్టం (state reorganisation act) ప్రకారం విశాఖలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి రూ.168 కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్లో రూ.78 కోట్లు పెంచింది.
- విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు 150 కోట్లు రూపాయలను కేటాయించింది. గత సంవత్సరం బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.126 కోట్లు తక్కువ.
- మౌలిక వసతుల కల్పనకు వివిధ విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా ఏపీలోని పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. ఏపీ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబీ (AIIB) నుంచి 150 కోట్లు రూపాయలు, ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (AP Irrigation and Livelihood Improvement Project) 2వ దశకు జపాన్ ప్రభుత్వం నుంచి 300 కోట్లు రూపాయలు, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్‌కు ఐబీఆర్‌డీ (IBRD) నుంచి రూ.300 కోట్లు, ఏపీ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఎన్‌డీబీ (NDB) నుంచి రూ.650 కోట్లు కేటాయించింది.
- తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు (Tribal Universities) ఈసారి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. వాటి కేటాయింపులను సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్లలో (Central University Grants) విలీనం చేశారు. ఇప్పటి నుంచి సెంట్రల్ యూనివర్సిటీల గ్రాంట్ల ద్వారానే గిరిజన వర్సిటీలకు నిధులు కేటాయిస్తుంది.