Center Announced Padma Awards : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను(Padma Awards 2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన పలువురు వ్యక్తులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేయనుంది. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు కళాకారులను ఎంపిక చేసింది. జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు ప్రకటించింది.
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం- తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మశ్రీ
Center Announced Padma Awards : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మశ్రీ పురస్కారం 34 మందికి ప్రకటించగా వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు కళాకారులు ఉన్నారు. జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప జాబితాలో ఉన్నారు.
Published : Jan 25, 2024, 10:25 PM IST
|Updated : Jan 25, 2024, 10:45 PM IST
జనగామకు చెందిన గడ్డం సమ్మయ్య(Gaddam Sammaiah) యక్షగానం కళలో సుప్రసిద్ధ వ్యక్తి. సామాజిక సమస్యలను యక్షగానంలో ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యవంతం చేశారు. వ్యవసాయకూలీగా జీవితాన్ని ప్రారంభించిన సమ్మయ్య, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా నేర్చుకున్నారు. గడిచిన అయిదు దశాబ్దాలుగా 19000 నాటకాలను ప్రదర్శించారు.
బుర్రవీణ వాయించే కుటుంబంలో మూడో తరానికి చెందిన దాసరి కొండప్పకు(Dasari Kondappa) కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప ఈ కళ కోసం తన జీవితాన్నే అంకితం చేశాడు. తెలుగు, కన్నడ భాషలలో సాంస్కృతిక, సాంఘిక పాటలను వాయించేవాడు.