తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో '100 రోజుల పాలన' - సెలబ్రిటీల రియాక్షన్‌! - AP CM CHANDRABABU 100 DAYS RULING - AP CM CHANDRABABU 100 DAYS RULING

AP CM Chandrababu 100 Days Ruling : ఆంధ్రప్రదేశ్‌ వరదలపై సీఎం చంద్రబాబు చూపిన పాలనాదక్షతను వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసించారు. చంద్రబాబు విజన్ ఏపీ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే సర్కారు పాలన వంద రోజులు పూర్తైన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

AP CM Chandrababu 100 Days Ruling
AP CM Chandrababu 100 Days Ruling (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 9:08 PM IST

CM Chandrababu 100 Days Ruling : ఏపీలో వరదలు విజృంభించినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన పాలనదక్షత భవిష్యత్‌ తరాలకు, నాయకులకు ఓ విలువైన పాఠమని పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కొనియాడారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకు ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, విజన్ ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు వంద రోజుల పాలన బాగుంది : " ఏపీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన బాగుంది. ఆయన తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టారు. పాలనలో అపారానుభవం ఉన్న చంద్రబాబు తన విజన్​తో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. చంద్రబాబుని చూసి గర్వపడుతున్నాను. ప్రజల సుఖశాంతులు, సంతోషమే ప్రధాన అజెండాగా పాలన సాగిస్తున్నారు. త్వరలోనే ఆయనను కలుస్తాను. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి నా వంతు సహకారమందిస్తాను." - సోనూ సూద్, ప్రముఖ సినీ నటుడు

చంద్రబాబు విజన్‌ గొప్పది :"వరద విలయంలోంచి ప్రజలను బయట పడేయడంలో చంద్రబాబు విజన్, పాలన కనిపించాయి. విపత్తు నిర్వహణ ఏ విధంగా చేయాలో భావితరాలకు ఓ పాఠంలా చూపించారు. ఆయన పాలనాదక్షత వల్లే వరద కష్టాల్లోంచి ప్రజలు త్వరగా కోలుకోగలిగారు." -పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ కోచ్

అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి చెందాలి :" ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ పురోగమిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఆనాడు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆఫ్రో-ఏషియన్ గేమ్స్​కు హైదరాబాద్​ను వేదికగా నిలిపేవిధంగా చేశారు. ఇప్పుడు ఆయన పాలనలో క్రీడలతో పాటు అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి చెందాలి." -మిథాలీరాజ్, మహిళా క్రికెటర్

సీఎంకు మరింత బలం చేకూరాలి : "ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ, అనుకోని విపత్తుల్ని సమర్థవంతగా అధిగమిస్తూ, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ఆయన కార్యదక్షతకు ఆ భగవంతుడు మరింత బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను." - ఉదయభాను, టీవీ వ్యాఖ్యాత

నాయకత్వమంటే ఏంటో చూపించారు : "నిజమైన నాయకత్వం అంటే ఎలా ఉంటుందో ఈ 100 రోజుల్లోనే చంద్రబాబు చూపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో, రాష్ట్ర భవిష్యత్‌ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చూపిన మార్గం అభినందనీయం." - సునీతా కృష్ణన్, సామాజిక కార్యకర్త

ఇలాంటి ప్రభుత్వమే అవసరం :"ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగంలో కొనసాగుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను. నాకీ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. ఆర్థిక కష్టాలను, విపత్తులను ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతోనే రాష్ట్రం విపత్తుల నుంచి బయటపడింది. ఆ గొప్ప వ్యక్తికి క్రీడాకారుల తరఫున శుభాకాంక్షలు. ఇలాంటి ప్రభుత్వమే రాష్ట్రానికీ, ప్రజలకు అవసరం." - పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

ABOUT THE AUTHOR

...view details