తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి - రాష్ట్ర ఎన్నికల అధికారులకు సీఈసీ ఆదేశం - Loksabha Elections Arrangements

CEC Review On Lok Sabha Elections Arrangements : లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉప కమిషనర్ నితీశ్​కుమార్ వ్యాస్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ స్వాధీనం చేసుకునే నగదు, నగలకు తగిన ఆధారాలు చూపిస్తే తిరిగి ఇచ్చే విధానం సరళతరం చేయాలని పేర్కొన్నారు. ఐటీ, ఇతర సాంకేతిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసి వినియోగించాలన్నారు. రానున్న ఎన్నికలకు అవసరమైన అదనపు బలగాలు, బడ్జెట్ అవసరాలపై అంచనాలు రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సూచించారు.

Telangana Loksabha Elections 2024
CEC Review On Loksabha Elections Arrangements

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 7:10 AM IST

పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

CEC Review On Lok Sabha Elections Arrangements: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలను గుర్తించి, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా వ్యూహాలు రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ నితీశ్​కుమార్ వ్యాస్ సూచించారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, అధికార యంత్రాంగం సన్నద్ధతపై ఆయన హైదరాబాద్ వచ్చి సమీక్ష నిర్వహించారు. శిక్షణ సమావేశాలు, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్ వివరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల విధుల్లో ఉన్నవారి ఓటింగ్ వంటి విషయాలపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు వ్యాస్ తెలిపారు.

'ఓ రాష్ట్రం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది'

Telangana Loksabha Elections 2024: వచ్చే లోక్‌సభఎన్నికలకు అదనపు బలగాలు, బడ్జెట్‌ అవసరాలపై అంచనాలు రూపొందించాలని అధికారులను కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఐటీ, ఇతర సాంకేతిక విధానాలను బలోపేతం చేయాలని సీనియర్ డిప్యూటీ కమిషనర్ రాష్ట్ర సీఈవోకు సూచించారు. ఎన్‌కోర్ యాప్‌ను సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల బయట కెమెరాలు ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిచ్చిందని అభినందించారు.

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై సభ్యుల వివరాలు తీసుకున్న పీఈసీ కమిటీ

Loksabha Elections Arrangements 2024 :గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వివరించారు. జప్తు చేసిన ప్రతీ వస్తువుకు పూర్తి వివరాలతో కూడిన రశీదులు ఇవ్వాలని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. తగిన ఆధారాలు చూపిస్తే వస్తువులు తిరిగి పొందే విధానాన్ని సరళతరం చేసి, ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని వ్యాస్ సూచించారు. వ్యాపారులు వ్యాపార లావాదేవీల కోసం తీసుకెళ్లే బంగారం, వెండి ఆభరణాల విషయంలో తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని తెలిపారు.

CEC Review On Loksabha Elections 2024 :ఎన్నికల వేళ తాయిళాల నియంత్రణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో తరచుగా సమావేశాలు నిర్వహించాలనిసీఈవోకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్లను జిల్లా స్థాయిలో ముద్రించాలని, ప్రతీ 500 పోస్టల్ బ్యాలెట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వ్యాస్ స్పష్టం చేశారు. సమీక్షలో అదనపు సీఈవో లోకేశ్​ కుమార్, డిప్యూటీ సీఈవో సత్యవాణి, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి సంజయ్ జైన్, ఎన్నికల వ్యయ నోడల్ అధికారి మహేశ్​ భగవత్ తదితరులు పాల్గొన్నారు.

LokSaba Speaker: తిరుమల శ్రీవారి సన్నిధిలో లోక్​సభ స్పీకర్ ఓంప్రకాశ్‌ బిర్లా

ఎంపీ సీటు కోసం మూడు పార్టీల్లోనూ తీవ్ర పోటీ - ఉమ్మడి పాలమూరులో అప్పుడే మొదలైన ఎన్నికల వేడి!

ABOUT THE AUTHOR

...view details