తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో శాంతియుతంగా లోక్​సభ ఎన్నికల నిర్వహణ - ఏర్పాట్లపై ఈసీకి వివరించిన సీఎస్‌ - Lok Sabha ELECTIONS 2024 - LOK SABHA ELECTIONS 2024

CEC Meeting Telangana Officials on MP Elections : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాగం అన్ని చర్యలు చేపడుతోంది. ఎన్నికల నిర్వహణపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహంచిన సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పలు సూచనలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను వివరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు.

EC On Lok Sabha Election Arrangements
Cs On Elections Arrangements In Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 9:26 AM IST

రాష్ట్రంలో శాంతియుతంగా లోక్​సభ ఎన్నికల నిర్వహణ

CEC Meeting Telangana Officials on MP Elections :తెలంగాణలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024)నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్‌ కుమార్‌, డా.సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కలసి భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు.

Telangana Lok Sabha Elections 2024 :తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసిన ఏర్పాట్లను అంశాల వారీగా ఈసీకి వివరించారు.

లోక్​సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు​- భద్రతా దళాల తరలింపు, మోహరింపుపై మీటింగ్- షెడ్యూల్​పై క్లారిటీ!

ఎన్నికల ఏర్పాట్లపై ఈసీకి వివరించిన సీఎస్:వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 154 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి 60 కంపెనీల కేంద్రం పారా మిలటరీ బలగాలు వచ్చాయని మరో 100 కంపెనీల బలగాలు త్వరలోనే రానున్నట్లు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలతో పోలీస్‌ సహా వివిధ శాఖల అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ. 69.66 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, మత్తుపదార్థాలు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు శాంతికుమారి వారికి వివరించారు.

ఎన్నికల్లో సమస్యలు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ వెల్లడించారు. జిల్లాలోని 1558 పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. 50 శాతం పోలింగ్‌ కేంద్రాలు పాఠశాల్లోనే ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది, పీవోలు, ఏపీవోలకు శిక్షణ పూర్తిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.

Police Checks in Telangana 2024 :రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా డబ్బు, మద్యం పట్టుపడుతోంది. ఖమ్మం జిల్లాలో ఆధారాలు చూపని రూ. 77.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ మంగళ్‌హట్‌లో కారులో తరలిస్తున్న కోటి రూపాయలను అధికారులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమంగా తరలిస్తున్న మద్యంను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల షెడ్యూల్​లో మార్పులు- ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్​ జూన్​ 4 బదులు ఈ తేదీన!

​ఏడు దశల్లో 2024 లోక్​సభ ఎన్నికలు- జూన్​ 4న కౌంటింగ్- పూర్తి​ షెడ్యూల్​ ఇదే

ABOUT THE AUTHOR

...view details