Theft in Tirumala Srivari Hundi :ఏపీలోనితిరుమల శ్రీవారి హుండీలో నగదు దొంగతనం జరిగింది. ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం డబ్బులను దొంగతనం చేసి పారిపోయాడు. దీంతో సీసీ కెమెరా దృశ్యాల ద్వారా చోరీ జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు.
Tirumala Vaikunta Dwara Darshan 2025 :వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులు ప్రజలకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమైన ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు.