Cash Seized in Ntr District: పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న వాహనంలో రూ.8.40 కోట్లు గుర్తించారు. వాహనాన్ని ఆపిన పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ క్యాబిన్లో ఉంచిన రూ. 8.40 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
పైపుల లారీలో నగదు తరలింపు- రూ.8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు - Cash Seized in Ntr District - CASH SEIZED IN NTR DISTRICT
Cash Seized in Ntr District: ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో లారీలో తరలిస్తున్న 8.40 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 8:22 AM IST
|Updated : May 9, 2024, 12:28 PM IST
దీనిపై పోలీసులు వివరాలు తెలిపారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పైపుల లారీలో అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకున్నట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు ప్లాస్టిక్ పైపులు లారీలో రవాణా చేసేందుకు వే బిల్లు తీసుకున్నట్టు తెలిపారు. ఈ లారీలో క్యాబిన్‌కు వెనుకవైపున ఐదు బాక్సుల్లో డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. గరికపాటి చెక్‌పోస్ట్ వద్ద లారీలు తనిఖీ చేస్తుండగా నగదు గుర్తించామని తెలిపారు. నగదును స్వాధీనం చేసుకొని ఇద్దరు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని, ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి వెళ్తుందో విచారణలో తెలుస్తుందని అన్నారు.