CASES FILED ON YSRCP LEADERS: అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితోపాటు మరో 16 మంది వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా తమ కార్యాలయం వద్ద ఆందోళన చేసి తమ విధులకు ఆటంకం కలిగించారని విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహానంది తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితోపాటు మరో 16 మంది వైఎస్సార్సీపీ నాయకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ర్యాలీ కారణంగా పట్టణంలో రాకపోకలు స్తంభించడంతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారని టీడీపీ మండల కార్యదర్శి మోపిడి గోవిందు కూడా ఫిర్యాదు చేశారన్నారు.