ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుష్ప' మూవీ యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు - CASE REGISTERED ON ACTOR SRITEJ

పెళ్లి పేరుతో శ్రీతేజ్‌ మోసగించారని మహిళ ఫిర్యాదు - శ్రీతేజ్‌పై బీఎన్‌ఎస్‌ 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు

Case_on_actor_Sritej
Case Registered on Actor Sritej (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 9:35 PM IST

Case Registered on Actor Sritej: నటుడు శ్రీతేజ్​పై తెలంగాణలోని హైదరాబాద్​ కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు జీరో ఎఫ్​ఐఆర్​ కింద కేసు నమోదు చేసుకుని, కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​కు ఫార్వర్డ్​ చేశారు. శ్రీతేజ్‌పై బీఎన్‌ఎస్‌ 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ మహిళ మొయినాబాద్​లో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి నటుడు శ్రీతేజ్​తో ఆమెకు పరిచయం ఉండడంతో, అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను శారీరకంగా వాడుకోవడంతో పాటు తన నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదని, తన పిల్లలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారు.

గతంలోనూ కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​లో ఓ మహిళ ఫిర్యాదు ​: గతంలోనూ ఓ మహిళ తనను మోసం చేశాడంటూ, భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడంటూ శ్రీతేజ్​పై కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆమెకు 2014లో సోషల్​ మీడియా ద్వారా శ్రీతేజ్ పరిచయమయ్యాడని, తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మంచి మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనూ శ్రీతేజ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇప్పుడు రెండో కేసు నమోదు:తాజాగా మంగళవారం కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​లో శ్రీతేజ్​పై నమోదైన కేసు రెండోది కావడం గమనార్హం. ఇప్పటి వరకూ శ్రీతేజ్​పై ఒక కేసు మాత్రమే ఉండగా, ఇప్పుడు రెండో కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సినిమాలతోపాటు వెబ్​సిరీస్​లో మంచి గుర్తింపు :సినీ నటుడు శ్రీతేజ్‌ వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, మంగళవారం, పుష్ప ది రైజ్‌ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 9 అవర్స్‌, బహిష్కరణ, పరంపర వంటి సిరీస్​ల్లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప ది రూల్‌’లో కూడా శ్రీతేజ్ కీలక ప్రాతలో నటిస్తున్నాడు.

బెడిసి కొట్టిన 'వ్యూహం' - అజ్ఞాతంలో ఆర్జీవీ

తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు - నటి కస్తూరి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details