Case Filed Against Hero Venkatesh And Family :సినీ నటుడు వెంకటేశ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్ బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఫిల్మ్‌నగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అసలు ఏం జరిగింది అంటే? : గతంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బాధితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందిన దక్కన్ కిచన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం పెరిగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబరులో జీహెచ్ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా కూల్చివేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.