Car Plunges Into canal P Gannavaram : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం చింతావారిపేట సమీపంలో ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు విశాఖపట్నం నుంచి పి.గన్నవరం మండంలోని పోతవరం ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కోనసీమ జిల్లాలో పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు - ఇద్దరు మృతి - CAR FALLS INTO CANAL P GANNAVARAM
చింతావారిపేట సమీపంలో ఘటన - గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2024, 8:08 AM IST
|Updated : Dec 10, 2024, 10:17 AM IST
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య డ్రైవింగ్ చేస్తోందని భర్త విజయ్‌కుమార్ తెలిపారు. ఉమతో పాటు కుమారులు మనోజ్, రిషి కాలువలో గల్లంతయ్యారని చెప్పారు. తన కళ్లముందే వారు కొట్టుకుపోయారని విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఉమ, పెద్ద కుమారుడు మనోజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.