ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీకి 'ఓటెత్తిన' పౌరులు- రహదారులు కిటకిట - Bus Stands rush with AP voters - BUS STANDS RUSH WITH AP VOTERS

Bus and Railway Stations Rush with AP Voters: ఓటేసేందుకు ఏపీ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌, విజయవాడ బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో సందడిగా మారాయి. అయితే సరిపడా బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఏపీలోని ఇతర ప్రాంతాలకు సరిపడా బస్సుల్లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

BUS STANDS RUSH WITH AP VOTERS
BUS STANDS RUSH WITH AP VOTERS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 8:08 AM IST

Bus and Railway Stations Rush with AP Voters: ఓట్ల పండుగ వచ్చింది. ఐదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వామ్యులు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ కట్టడంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 13న శాసనసభ, లోక్ సభకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు హైదరాబాద్‌లోని ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివస్తున్నారు. ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా భారీ సంఖ్యలో నగరవాసులు సొంతూళ్లకు పయనమైయ్యారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేవారితో ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కుక్కట్‌పల్లి, సాగర్‌ రింగ్‌ రోడ్‌ బస్టాప్‌లలో రద్దీ నెలకొంది. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లనుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంలో ఈసీ కీలక ఆదేశాలు - పార్టీ అభ్యర్థులు ధ్రువీకరించాలని స్పష్టం - EC orders on polling agents

దొరికిందే అనువుగా ఛార్జీల మోత: స్వగ్రామాలకు వెళ్లేందుకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తుంటే, ఇంకొందరు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌ నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. పదిరోజుల నుంచే బస్సుల్లో సీట్లన్ని నిండుకున్నాయి. ముందస్తు బుకింగ్‌లు అయిపోవడంతో ప్రత్యమ్నాయ మార్గాలవైపు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్దాం అనుకుంటే దొరికిందే అనువుగా ఛార్జీలు అధికంగా పెంచేశారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల అసహనం:మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులతోపాటు, ఏపీలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు వారికి రవాణా సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

"మేము కత్తిపూడి వెళ్తున్నాము. కార్లు అయినా, బస్సులు అయినా చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు. విజయవాడకు 1500 రూపాయలు అడుగుతున్నారు. కత్తిపూడికి అయితే 2100 అడుగుతున్నారు. బస్సులు ఎక్కువగానే వేశాము, అయిపోయాయి అంటున్నారు. కుటుంబంతో ముందుగానే బయలుదేరాము అయినా సరే బస్సులు ఖాళీగా లేవు". - ప్రయాణికుడు

రైల్వే ప్రయాణికులకు గుడ్​ న్యూస్- ఆంధ్రాకు 50 ప్రత్యేక రైళ్లు - SPECIAL TRAINS schedule

సొంతూళ్లకు 'ఓటెత్తిన' ఏపీ ప్రజలు - బస్టాండ్లు కిటకిట - ప్రయాణికులు అవస్థలు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details