Mumbai Actress Case : ముంబయి నటి కేసు విచారణలో భాగంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో రెండో నిందితుడు (A2) సీతారామాంజనేయులును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. సీతారామాంజనేయులు ఇప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అని వ్యాఖ్యానించారు. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్‌గున్నీ పిటిషన్లపై హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
ముంబై సినీ నటి అక్రమ అరెస్టు, వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా ఇప్పటి వరకు కేసులో A2 ఐపీఎస్ సీతారామాంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తి అడిగారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు కదా అని పీపీని ప్రశ్నించారు.
ఈ కేసులో ఏ1గా విద్యాసాగర్, ఏ2గా పి. సీతారామాంజనేయులు (PSR), ఏ3గా కాంతిరాణా, ఏ4గా హనుమంతురావు (ఏసీపీ), ఏ5గా సత్యనారాయణ (సీఐ), ఏ6గా విశాల్‌గున్నీ ఉన్నారు. ఈ ఐదుగురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.
"సినీ నటి కాదంబరి కేసు" - వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు - Kadambari Jethwani Case Updates
"ముంబయి సినీ నటి కేసు" - ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా