Pulivendula Bus Accident Today : వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
లోయలో పడిన ఆర్టీసీ బస్సు - 20 మందికి గాయాలు - BUS ACCIDENT IN PULIVENDULA
పులివెందుల సమీపంలో అదుపు తప్పిన బస్సు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2024, 9:02 AM IST
|Updated : Oct 23, 2024, 2:27 PM IST
కదిరి నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు పులివెందుల సమీపంలోని డంపింగ్‌యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్ సడెన్గా బ్రేకులు వేశారు. దీంతో బస్సు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ క్రమంలోనే చెట్లను తాకుతూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. క్షతగాత్రులను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.