Bull Race Competition at Bapatla District :సంక్రాంతి పండగంటేనే కోడి పందేలు, ఎడ్లబళ్ల పరుగు పోటీలు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పోటీల్లేకుండా పండగ జరుపుకోవడం ఉండదు. సంక్రాంతి మొదలు ఉగాది వరకు తీర్థాలు జరుగుతూనే ఉంటాయి. వీటిల్లోనూ ఎడ్లబళ్ల పరుగు పోటీలు ఉండాల్సిందే. విజేతగా నిలిచిన ఎడ్లకు రూ.పది వేల నుంచి రూ.లక్ష పైగా నగదు బహుమతి ఇస్తారు. నగదు కోసం కాకుండా పోటీల్లో సత్తా చాటేందుకు పలువురు యువ రైతులు తమ ఎడ్లతో ఈ సంక్రాంతికి సన్నద్ధమయ్యారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపట్ల జిల్లా అన్నంబోట్లవారిపాలెంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన ఉత్కంఠంగా సాగుతున్నాయి. గొట్టిపాటి హనుమంతరావుమోమెరియల్ ప్రాంగణంలో కొనసాగుతున్న 37వ ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో తొలిరోజే జాక్పాట్ పందెం నిర్వహించారు. వివిధ ప్రాంతాలనకు చెందిన తొమ్మిది జతలు గిత్తలు నిర్దేశించిన 22 క్వింటాళ్ల బరువును 20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి సత్తా చాటాయి. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. గెలుపొందిన మెుదటి స్థానం విజేతకు సుమారు లక్షన్నర రూపాయలు మిగిలిన ఎనిమిది జతలకు నగదు బహుమతులు అందజేశారు.