తెలంగాణ

telangana

ETV Bharat / state

డిగ్రీలు పూర్తి చేసి - సహజ సిద్దమైన వంట నూనె తయారీ వ్యాపారంలో రాణిస్తున్న ముగ్గురు మిత్రులు

Bull Driven Oil Yuva Story : డిగ్రీలు పూర్తి చేశారు. ముంబయి నగరానికి వెళ్లి ఉద్యోగం చేశారు. అంతా సాఫిగానే సాగుతున్నా, ఆ యువకుల జీవితంలో ఏదో తెలియని వెలితి. ఉన్న ఊరికి కన్నవారికి దూరంగా ఉంటుంన్నామనే భావన. ఆప్యాయంగా పలకరించేవారు, అన్యోన్యంగా గడిపేవారు కరువయ్యారనే అలోచన. పైసల కోసం పరితపించి కుటుంబానికి దూరంగా ఉండటంకంటే గ్రామంలోనే సంతోషంగా గడపవచ్చని ఇంటికి తిరిగి వచ్చారు. సొంతంగా వ్యాపారాన్ని స్థాపించి అనతి కాలంలోనే లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. మరి, ఆ యువకులు ఏవరు? వాళ్లు చేస్తున్న వ్యాపారం ఏమిటో చూసేద్దామా..!

Bull Driven Oil Business
Bull Driven Oil Yuva Story

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 2:13 PM IST

Bull Driven Oil Yuva Story :ఎంత పెద్ద ఉద్యోగమైనా ఒకరి కింద పనిచేయాల్సి ఉంటుంది. సొంత ఆలోచనలకు తావులేకుండా యాజమాని చెప్పినట్లే నడుచుకోవల్సి వస్తుంది. కానీ సొంత వ్యాపారం చిన్నదైనా, దానివల్ల కలిగే ఆత్మ సంతృప్తికి వెల కట్టలేమని భావించారు ఈ యువకులు. ముగ్గరు స్నేహితులు మమేకమై సొంత గ్రామానికి తిరిగివచ్చారు. ఎద్దుతో నడిచే చెక్క గానుగను ప్రారంభించి స్వయంగా ఉపాధి పొందుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పీపల్‌పహాడ్‌ చెందిన ప్రవీణ్‌, రంగయ్య, పంతంగి గ్రామానికి చెందిన చేకూరి బాబు పేద కుటుంబాలకు చెందిన వారు. డిగ్రీలు పూర్తి చేసి ఉపాధి కోసం ముంబయికి వెళ్లారు. ‌కంపెనీలలో ఇచ్చే వేతనాలకంటే జీవితంలో వెలితే ఎక్కువగా ఉందనే భావనతో గ్రామానికి తిరిగి వచ్చారు. ఎద్దుతో నడిచే గానుగను ప్రారంభించి స్వచ్ఛమైన వంటనూనెను తయారు చేస్తున్నారు.

చేనేత కుటుంబ నుంచి ఎన్​సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం

తాము స్థాపించే చిన్న వ్యాపారమైన సమాజనికి మేలు చేసేదిలా ఉండాలని అనుకున్నారు ఈ యువకులు. సుపరిచితుల సూచనలతో ఎద్దుతో నడిచే చెక్క గానుగను ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. దానికోసం పాలమూరు జిల్లా జక్లక్‌పల్లిలో శిక్షణ ఇస్తున్నారని తెలుసుకున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి గానుగ నుంచి నూనె తీసే పద్ధతిని అవలంభించారు.

Bull Driven Oil Business :గ్రామంలోనే ఈ గానుగను ఏర్పాటు చేస్తే ఆదరణ తక్కువగా ఉంటుందని భావించారు. దానికోసం కొయ్యలగూడెంలో జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. తమ వద్ద ఉన్న నగదులో పాటు బంధుమిత్రుల దగ్గర నుంచి రూ.15లక్షలు పోగు చేశారు. వాటితో రెండు గానుగలు, షెడ్డు నిర్మాణం, ఎద్దులు కొనుగోలు చేశారు. గానుగలోకి కావాల్సిన ముడిసరుకులను స్థానిక రైతుల నుంచి సేకరిస్తున్నామని చెబుతున్నారు.

ఎద్దు గానుగ నుంచి వేరుశనగ, కొబ్బరి, నువ్వులు, ఆముదం వంటి నూనెలు తయారు చేస్తున్నారు. రోజుకు సుమారు 30 లీటర్ల నూనె ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. ఖర్చులన్నీ పోనూ నెలకు లక్ష పైగా ఆదాయం అర్జిస్తూ వ్యాపారం చేయాలని ఆనుకునే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మేలు దిశగా అడుగులు వేయాలని: యంత్రాల ద్వారా తయారు చేసిన నూనెకంటే గానుగ నూనె వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్నారు ఈ యువకులు. సహజసిద్ధంగా తయారయ్యే గానుక నూనెలో పోషకాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. నూనె తీయగా వచ్చిన పిప్పి ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. దానిని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం వస్తోందని వివరిస్తున్నారు.

సంక్రాంతికి అంగళ్లు కిటకిట- అరిసెలు, సకినాలు, నువ్వుల లడ్డూలకు మంచి డిమాండ్

బయట దొరికే ఆయిల్ కంటే గానుగ నుంచి తీసిన నూనెతో చేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. దీంట్లో ఎటువంటి కల్తీ లేకపోవడంతో తరచూ ఇక్కడే విక్రయిస్తున్నామని అంటున్నారు.

ఎద్దు గానుగను ప్రారంభించే వారికి కేంద్రం రాయితీ ఇస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం 2 గానుగల ద్వారా నూనెను ఉత్పత్తి చేస్తున్నామంటున్నారు. రాబోవు రోజుల్లో గానుగల సంఖ్యను పెంచి మరింత ఉత్పత్తి చేసే యోజనలో ఉన్నారు. ఉత్పత్తికి ఆదరణ పెరుగుతున్నందున మార్కెటింగ్ చేసే దిశగా అడుగులేస్తున్నారు.

సొంతంగా వ్యాపారం చేయడం వల్ల మనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చని ఈ ముగ్గురు చెబుతున్నారు. యువత ఉద్యోగాల కోసం విదేశాలకు పట్టణాల వెళ్లకుండా స్వయం ఉపాధి వైపు అడుగులేయాని సూచిస్తున్నారు.

Bull Driven Oil Yuva Story డిగ్రీలు పూర్తి చేసి సహజ సిద్దమైన వంటనూనే తయారీ వ్యాపారంలో రానిస్తున్న ముగ్గురు మిత్రులు

సపోర్ట్‌ లేకున్నా సలార్‌లో అవకాశం - జూనియర్ వరదరాజ మన్నార్‌ ఇంటర్వ్యూ

సజీవ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ @ఫొటోగ్రాఫర్‌ శ్రవణ్ - కెమెరా క్లిక్‌మందంటే అవార్డు పక్కా!

ABOUT THE AUTHOR

...view details