తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రంగంలోకి కేసీఆర్ - వచ్చే వారం నల్గొండలో భారీ బహిరంగ సభ

BRS Public Meeting in Nalgonda : కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ వచ్చే వారం నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 13వ తేదీన సభ నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.

BRS Leaders Planning Counter To CM Revanth Reddy
BRS Nalgonda Public Meet

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 7:54 AM IST

BRS Public Meeting in Nalgonda : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఔట్ లెట్ల స్వాధీనం విషయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన భేటీలో పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. తాజా పరిణామాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను మాజీ మంత్రి హరీశ్​ రావు వివరించారు.

ప్రాజెక్టులపై దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చేందుకు మేం రెడీ - అసెంబ్లీ ఎప్పుడు పెడతారో చెప్పండి : హరీశ్​రావు

శ్రీశైలం, సాగర్ ఔట్ లెట్లను అప్పగిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని పేర్కొన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు అప్పగించలేదని, షరతుల గురించి సమావేశంలో వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వాస్తవ విరుద్ధంగా మాట్లాడారని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు సమావేశంలో వివరించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోబోమన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఈ విషయంలో పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్దామని నేతలకు వివరించారు. తాను కోలుకున్నానని, ఇక ప్రజల్లోకి వస్తానని చెప్పారు.

ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం - కాంగ్రెస్​ సర్కార్​పై బీఆర్​ఎస్ నేతల ధ్వజం

BRS Leaders Planning Counter To CM Revanth Reddy : కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమావేశం వ్యతిరేకించింది. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని బీఆర్ఎస్ ఆక్షేపించింది. కృష్ణా బోర్డుకు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఔట్ లెట్లను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ, వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

కాంగ్రెస్​ 420 హామీలు చూసి జనం మోసపోయారు - చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది : కేటీఆర్

బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సభ నిర్వహించాలన్న ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 13వ తేదీన నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ సభకు హాజరు కానున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ మొదటి బహిరంగ సభకు హాజరు కానున్నారు. నల్గొండ సభ కోసం మంగళవారం తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలు సమావేశానికి హాజరు కానున్నారు.

కృష్ణా నదీ జలాల వాడకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది : జగదీశ్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details