BRS MLA Malla Reddy On TDP: ఇప్పుడు రాజకీయాలు వద్దు వద్దు అంటూనే తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయనను మీడియా ప్రతినిధులు సంప్రదించారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారా.? అని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.
Malla Reddy Met Union Minister Kishan Reddy : హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని తన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రిక కిషన్‌రెడ్డికి అందజేసి వివాహ మహోత్సవానికి హాజరుకావాలంటూ సాదరంగా ఆహ్వానించారు. మనవరాలు పెళ్లి శుభలేఖ ఇచ్చి కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వంగా ఆహ్వానించడానికి తాము బీజేపీ కార్యాలయానికి వచ్చినట్లు మల్లారెడ్డి తెలిపారు. వ్యక్తిగతంగా కిషన్‌రెడ్డి నాకు చిన్నప్పట్నుంచి బాగా తెలిసిన వ్యక్తి ఆయన బీజేపీలో అంచెలంచెలుగా కేంద్రమంత్రి స్థాయిదాకా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి :మరోవైపు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి వెళ్లారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు పెళ్లి ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కలిసి అందజేశారు.