Jagadish Reddy Reacts on Pocharam :పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడి, కాంగ్రెస్‌లో చేరడం దురదృష్టకరమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు కూడా పోచారం, కేసీఆర్‌తోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఏమీ కాదు, అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్‌కు పోచారం చెప్పారని తెలిపారు. ఏ బలహీనతలు, ఏం ఆకర్షించిందో పోచారం పార్టీ మారారని, ఆయనకు పార్టీలో ఏం తక్కువ చేశామని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
రైతులు మళ్లీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది : జగదీశ్ రెడ్డి - BRS MLA Jagadeesh Reddy
పార్టీ మారడం వల్ల పోచారంకు ఏం వస్తుందో కానీ, ప్రజల్లో అప్రతిష్ఠ మాత్రం మూటగట్టుకుంటారని పేర్కొన్నారు. పార్టీలు మారడం కొత్తగా బీఆర్ఎస్‌తోనే ప్రారంభం కాలేదని, కేసీఆర్ అదృశ్యం అవుతారని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు దేశంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారని, కేసీఆర్ ఫీనిక్స్ పక్షిలా పుంజుకొంటారని, బీఆర్ఎస్ గతంలో కంటే ఘనంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం అంతటా బీఆర్ఎస్, కాంగ్రెస్ శత్రువులని, కానీ బీఆర్ఎస్ విషయంలో మాత్రం ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆయన దుయ్యబట్టారు.
Niranjan Reddy responds on Pocharam : పోచారం లాంటి పెద్ద మనిషి పార్టీ మారడం గర్హనీయమని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 2012లో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీచేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామన్నారు. 2014లో గెలిచిన ఆయనను తెలంగాణ మొదటి వ్యవసాయ శాఖా మంత్రిగా, 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్పీకర్‌గా చేసే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.