రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి రాజీనామా పత్రంతో వచ్చా Harish Rao VS Revanth Reddy : మెదక్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న ఆయన హామీల అమలుపై సీఎం అమరవీరుల స్తూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హరీశ్‌రావు రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు.
మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు : సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసగించే యత్నం జరుగుతుందని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లపై రాసిచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు రేవంత్ ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రావడానికి ఇబ్బందిగా ఉంటే వారి పీఏ, సిబ్బందితో రాజీనామా లేఖను ఇక్కడికి పంపించినా ఫర్వాలేదని అన్నారు. మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు పెడదామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao Accept Revanth Challenge : ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని, ఒకవేళ హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని హరీశ్‌రావు చెప్పారు. చేయకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ గవర్నర్ ఇవ్వాలని తెలిపారు. అలాగే తాను ఉపఎన్నికలో కూడా పోటీ చేయనని స్పష్టంగా చెప్పానని హరీశ్‌రావు అన్నారు.
ఓటు అడిగేందుకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలి : హరీశ్‌రావు - Harish Rao Election Campaign
Harish Rao Fires on Congress Guarantees : వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు బాధ్యత తనదంటూ సోనియా లేఖ రాశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆరు హామీలు, రుణమాఫీపై ముఖ్యమంత్రి తొలి సంతకం పెడతామన్నారని, మాట తప్పిన ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే ముఖ్యమని పేర్కొన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడు ఆ లేఖను జర్నలిస్టుల చేతిలో పెట్టి వెళ్తున్నట్లు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
"రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఏ రోజు కూడా అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించలేదు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లపై రాసిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే ప్రధాన ప్రతిపక్షంగా మా కర్తవ్యం. రాజకీయాల కంటే పేద ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం. అవ్వ, తాతలకు రూ.4,000లు పింఛన్ ఇవ్వాలి. రైతులకు రూ.15,000లు రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ అందించాలి.వరి, మక్కలకు రూ.500 బోనస్ ఇవ్వాలి. మహిళలకు రూ.2500 ఇవ్వాలి." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేత
అబద్ధాలు ఆడటంలో ఏదైనా అవార్డు ఉంటే - సీఎం రేవంత్ రెడ్డికే ఫస్ట్ ప్రైజ్ : హరీశ్‌రావు - harish rao counter to cm revanth
హామీలపై నిలదీస్తే రేవంత్‌కు అంత అసహనమెందుకు? : హరీశ్‌రావు - Harish Rao Comments on CM Revanth